ఓదెలును పరామర్శించిన మంత్రి
Nallala Odelu: మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెన్నూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలును న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన నివాసంలో మంత్రి పొంగులేటి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యపరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.