సింగరేణిలో వన మహోత్సవ జోష్
Singareni: సింగరేణి వ్యాప్తంగా ఆదివారం వనమహోత్సం జోష్గా కొనసాగింది. కొత్తగూడెం ఏరియాలోని జీకే ఓసీలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని సీఎండీ ఎన్.బలరామ్(Singareni CMD N. Balaram) ప్రారంభించారు. ఆయన స్వయంగా 121 మొక్కలను నాటి అందరిలో స్ఫూర్తి నింపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో సింగరేణి ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలు నాటనున్నట్లు ఆయన వెల్లడించారు. నీటి బిందువు జల సింధువులో భాగంగా తవ్విన మినీ చెరువు నిండటంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. చెరువు పక్కన ఆయన కొద్ది సేపు ధ్యానం చేశారు. ప్రకృతి పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణను యజ్ఞంగా చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.