ఆపరేషన్ సింధూర్‌పై రాహుల్ కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi: పహల్గాంఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ సమయంలో కేంద్రం వ్యహరించిన తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బెదిరింపులకు ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) లొంగిపోయారని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే మోదీకి ట్రంప్ ఫోన్ చేశారని, నరేందర్ సరెండర్ అనగానే మోదీ ‘జీ హుజూర్’ అంటూ ఆపరేషన్ నిలిపేశారని రాహుల్ ఆరోపించారు. సరెండర్ కావడం బీజేపీ ఆరెస్సెస్‌లకు అలవాటేనని విమర్శించారు. ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడ్డారని, కానీ నాడు ఇందిరాగాంధీ ఎవరి బెదిరింపులకూ భయపడలేదని రాహుల్‌గాంధీ అన్నారు.