కాగజ్‌నగర్‌లో దారుణ హత్య
Murder:కొమురంభీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో యువకుడి హత్య కలకలం రేపింది. పట్టణంలో సిబాపు కాలనీ పెద్దవాగు రోడ్డు సమీపంలో ఈ హత్య ఘటన చోటు చేసుకుంది. ఇందిరా మార్కెట్ కు చెందిన సయ్యద్ దావుద్ (18) అనే యువకున్ని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో తలమీద మోది హత్య చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.