మంత్రి వివేక్ కి సన్మానం
Minister Vivek: మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఆయన సోదరుడు వినోద్ ను బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు గజమాలతో సన్మానించారు. వివేక్ కి మంత్రి పదవి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు మంత్రి పదవితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రిని సన్మానించిన వారిలో మునిమంద రమేష్,మురళీధర్ రావు, మహేందర్, ముడి మడుగుల అశోక్ గౌడ్,బాస్కర్ యువ ఎడ్యుకేషనల్ గ్రుప్స్ చైర్మన్, నర్సింగ రావు, హరీష్ గౌడ్, చిలుముల శంకర్, కేవీ ప్రతాప్ పాల్గొన్నారు.