ఆ కుటుంబానికే కార్మిక శాఖ..

ఒకే శాఖను తండ్రి, ఇద్దరు కొడుకులు నిర్వహించడం ఒక రకంగా రికార్డు.. ఆ రికార్డ్ సాధించారు గడ్డం కుటుంబ సభ్యులు.. ఈ ముగ్గురు కూడా కార్మిక శాఖ మంత్రులుగా నియామకం కావడం గమనార్హం…

గడ్డం కుటుంబానికి కార్మిక శాఖ కలిసి వస్తోంది. అటు తండ్రి, ఇటు కొడుకులు ఇద్దరూ ఆ శాఖ మంత్రులుగా చేయడం గమనార్హం. తండ్రి వెంకట స్వామి కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా చేయగా.. కొడుకులు ఇద్దరూ రాష్ట్ర కార్మిక మంత్రులుగా నియామకం అయ్యారు. కార్మిక నేతగా ఎదిగిన వెంకటస్వామి ఒకసారి రాష్ట్ర, రెండు సార్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 101 కార్మిక సంఘాలకు అధ్యక్షునిగా కొనసాగిన ఏకైక నాయకుడు కాకా. 1973, 1995లలో కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. 1978లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక శాఖ బాధ్యతలు చేపట్టారు.

ఇక వెంకట స్వామి పెద్ద కొడుకు వినోద్ రాష్ట్ర కార్మిక మంత్రిగా పనిచేసారు. వినోద్ 2004 నుండి 2009 వరకు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసారు. ఇప్పుడు ఆయన తమ్ముడు వివేక్ సైతం అదే శాఖ మంత్రిగా నియమితులు కావడంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చెన్నూరుకు మూడో సారి అదే శాఖ..
కార్మిక శాఖ మంత్రి పదవి చెన్నూరు నియోజక వర్గానికి దక్కడం కూడా ఇది మూడో సారి కావడం గమనార్హం.
ఆయన 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోదాటి ప్రదీప్‌పై గెలిచి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఇక వినోద్ సైతం చెన్నూరు నుండే ఎమ్మెల్యేగా గెలుపొంది కార్మిక శాఖ బాధ్యతలు చేపట్టగా, ఇప్పుడు ఆయన తమ్ముడు సైతం చెన్నూరు నుండి గెలుపొంది కార్మిక శాఖ మంత్రి అయ్యారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like