ఏం చేద్దాం…?
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై నేడు ప్రగతి భవన్లో పార్లమెంటరీ పార్టీ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 29నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నారు.కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి లోక్ సభ,రాజ్య సభ సభ్యులు హాజరు కానున్నారు. సమావేశంలో ప్రధానంగా వరి కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై చర్చసాగనుంది. అదే సమయంలో నూతన విద్యుత్ చట్టం రద్దు, పంటలకు మద్దతు ధరకు చట్టంపై చర్చించనున్నారు. అంతేకాకుండా నీటి పంపకాల విషయంలో ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంపై కూడా మాట్లాడనున్నారు. రాష్ట్ర ప్రధాన సమస్యల విషయంలో కేంద్రంపై పోరాటం గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగనుంది. ధాన్యం కొనుగోలు విషయంలో దేశవ్యాప్తంగా తెలంగాణ సమస్య గుర్తించేలా పార్లమెంటులో లోపల, బయట ఆందోళన చేయాలని యోచనలో టిఆర్ఎస్ ఉంది. ఈ రోజు నిర్వహించనున్న సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించనున్నారు.