పెళ్లి చేసుకుంటా అని మోసం చెసిన యువకుడు

న్యాయం కోసం ఇంటి ముందు యువతి ఆందోళ‌న

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం పోచంపల్లిలో ఓ యువ‌కుడు త‌న‌ను ప్రేమించి పెండ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేశాడ‌ని యువ‌తి ఆందోళ‌న‌కు దిగింది. త‌న‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఇక్క‌డి నుంచి వెళ్ల‌నంటూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. వివ‌రాల్లోకి వెళితే.. బోరెం శ్వేత (24) అనే యువ‌తి పోచంపల్లిలో నివాసం ఉంటోంది. అదే గ్రామానికి చెందిన గొర్లపల్లి కళ్యాణ్ అనే వ్య‌క్తి ఏడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇప్పుడు త‌న‌ను పెండ్లి చేసుకోమంటే చేసుకోన‌ని క‌ళ్యాణ్ మొహం చాటేస్తున్నాడ‌ని శ్వేత ఆవేద‌న వ్య‌క్తం చేసింది. శ్వేత ఈ విషయాన్ని ఊరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లి చెప్పగా వారు కూడా కళ్యాణ్ ను పిలిచి మందలించారు. అయితే, వారితో దురుసు మాట్లాడిన అత‌ను పెళ్లి చేసుకొనని తేల్చి చెప్పాడు. దీంతో శ్వేత చివరికి కళ్యాణ్ ఇంటి ముందట న్యాయ పోరాటనికి దిగింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ కళ్యాణ్ నేను ఎన్నో ఏండ్లుగా ప్రేమించుకున్నామ‌ని, చివరికి పెళ్లి చేసుకుందాం అంటే చంపుతా అని బెదిరిస్తున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న‌కు క‌ళ్యాణ్‌తో పెండ్లి చేసి త‌న‌కు న్యాయం చేయాల‌ని శ్వేత కోరుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like