సింగరేణిలో కొనసాగుతున్న సమ్మె
Singareni Strike: కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో కొనసాగుతోంది. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారు. అత్యవసర సిబ్బంది మినహా ఎవరూ విధులకు హాజరుకాలేదు. కార్మిక సంఘం నేతలు గనులపై తిరుగుతూ సమ్మె పర్యవేక్షిస్తున్నారు. ఈ సమ్మె కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఈ సమ్మెకు AITUC, INTUC, CITUC, HMS, బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, విప్లవ కార్మిక సంఘాలు సైతం సింగరేణి సమ్మెకు మద్దతు ప్రకటించాయి. కార్మికుల హక్కులు రక్షించుకోవాలంటే సమ్మెలో కచ్చితంగా పాల్గొనాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు.