సమ్మెకు మద్దతుగా నల్లబ్యాడ్జీలతో ఆందోళన
Singareni:దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెకు బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి సిబ్బంది సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న విధానాలపై పలు కార్మిక సంఘాలు దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏరియా ఆసుపత్రి నల్లబ్యాడ్జీలు పెట్టుకుని సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ ఏరియా నాయకులు సోకాల శ్రీనివాస్, వినయ్ కుమార్, రాజశేఖర్, కృష్ణ వేణి, సృజన, ఏఐ టియూసీ పిట్ కార్యదర్శి డిఆర్ శ్రీధర్, అన్వేష్, ప్రకాష్, పద్మ, జ్యోతి, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి ఉదయ్, సత్యనారాయణ, రవుఫ్, శ్రీనివాస్ పాల్గొన్నారు