కొమురం భీం ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తివేత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురంభీం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 3గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 అడుగులు కాగా ప్రస్తుతం 238.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నిల్వ సామర్ధ్యం 10 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.278 టీఎంసీలు ఉంది. ప్రాజెక్ట్ 4,5,6 మూడు గేట్లు 0.5 మేరకు ఎత్తి.. 3393 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. 3,206 క్యూసెక్కుల కొనసాగుతొందని అధికారులు వెల్లడించారు.