పోలీసులు అన్యాయం చేశారంటూ ఆత్మహత్యాయత్నం
పోలీసులు తనకు అన్యాయం చేశారనీ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు.వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పాత సార్సాల గ్రామానికి చెందిన పాముల శ్రీనివాస్ కు కొద్ది రోజులుగా భూ వివాదం కొనసాగుతోంది. అయితే ఈ విషయంలో పోలీసులు తనకు న్యాయం చేయలేదని గురువారం పురుగుమందు తాగాడు. సెల్ఫీ వీడియో తీసుకుని మరి మందు తాగాడు. ఈస్గాం పోలీసులు తనను లంచం అడిగారని, ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని వీడియో తీసుకున్నారు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.