రోడ్డు వేయాలంటూ విద్యార్థుల ఆందోళన
Student concerns: కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం భట్టుపెల్లి గ్రామంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. భట్టుపెల్లి దహెగాం ప్రధాన రహదారి పై విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. జీడిచేనులో ఉన్న పాఠశాలకు వెళ్లే దారిలేక తాము ఇబ్బందులు పడుతాన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దారి ప్రమాదకరంగా ఉందని, రోడ్డంతా బురదతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇక్కట్లు పడుతున్నామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు జారిపడి గాయాలపాలవుతున్నారని వెల్లడించారు. పాఠశాలకు ఈ ఒక్కదారి తప్ప వేరే దారి కూడా లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు పట్టించుకుని తమ పాఠశాలకు రోడ్డు వేయాలని కోరారు.