కొన‌సాగుతున్న ఆదివాసీల బంద్‌

G.O. No. 49:టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జోన్ జీవో 49(G.O. No. 49) ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలంటూ (Cancellation) ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళ‌న‌లు కొన‌సాగ‌తున్నాయి. దానిలో భాగంగా ఆదివాసీలు సోమ‌వారం బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ కొన‌సాగుతోంది. ఎక్క‌డిక్క‌డ ఆదివాసీ నేత‌లు ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఉమ్మ‌డి జిల్లాలో ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో వ్యాపారులు దుకాణాలు మూసివేసి స్వ‌చ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వాహ‌నాలు సైతం నిలిపివేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆదివాసీల ధర్నా చేప‌ట్టారు. జీఓ నంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. ఉదయం 4 గంటల నుంచి బస్సులు బయటకు వెళ్ళకుండా బైఠాయించారు. కాగ‌జ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో సైతం స్వ‌చ్ఛంద బంద్ కొనసాగుతోంది. పట్టణంలో అన్ని రకాల షాప్ లు బందు పెట్టించి వ్యాపారులు త‌మ మద్దతు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like