భారీ వర్షాలకు కూలిన ఇల్లు… తప్పిన ప్రమాదం..
House collapses due to heavy rains:మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. అయితే, అందులో నివసిస్తున్న వృద్ధులు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేటలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొమిరె వెంకటస్వామి అనే నిరుపేద ఇళ్ళు కూలిపోయింది. ఇల్లు కూలే సమయంలో ఇంట్లో నివసిస్తున్న ఇద్దరు వృద్ధులు పక్కనే ఉన్న తన కొడుకు తాత్కాలికంగా నిర్మించుకున్న ఇంట్లోకి వెళ్లారు. దీంతో తమకు ప్రాణాపాయం తప్పిందని బాధితులు పేర్కొన్నారు. ఉన్న ఇల్లు కూలి తాము నిరాశ్రయులుగా మారామని నిలువనీడ లేకుండా పోయిందని ప్రభుత్వం తమను వెంటనే ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.