కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

Operation Mahadev: పహల్గామ్‌ దాడికి బాధ్యులైన ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను భార‌త సైన్యం మ‌ట్టుబెట్టింది. ఆ దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. శ్రీనగర్‌ హర్వాన్‌-లద్వాస్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్ ప్రారంభించారు. ఆసిఫ్‌ ఫౌజీ, సులేమాన్‌షా, అబూ తల్హా అనే ఉగ్రవాదులు చనిపోయారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులపై ఒక్కొక్కరి మీద రూ. 20 లక్షల రివార్డు ఉంది. సంచార జాతులు ఇచ్చిన సమాచారంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి.

ఓవైపు లోక్‌సభలో ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చ జరుగుతున్న వేళ్ల పహల్గామ్‌ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆపరేషన్ సింధూర్‌ అంటూ ప్రతిదాడికి దిగింది భారత్.. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇవాళ జ‌రిగిన ఆప‌రేష‌న్ గురించి ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like