మిమ్స్ క‌ళాశాల‌పై చ‌ర్య‌లు తీసుకోండి

Manchryal: మంచిర్యాలలోని మిమ్స్ జూనియర్ కళాశాల మూడో అంతస్తు నుండి కిందపడి మృతి చెందిన సహస్ర కుటుంబానికి న్యాయం చేయాల‌ని, ఆ క‌ళాశాల యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళ‌న నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని ఐబి చౌరస్తాలో రాస్తారోకో నిర్వ‌హించారు. వారికి మ‌ద్ద‌తుగా విద్యార్థి సంఘాలు సైతం ఆందోళ‌న నిర్వ‌హించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో మిమ్స్ క‌ళాశాల యాజ‌మాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నడిపిస్తున యాజమాన్యంపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని విద్యార్థి సంఘాల‌తో పాటు, కుటుంబ సభ్యులు కోరారు.

మిమ్స్ జూనియర్ కళాశాలలో మూడో అంతస్తు నుండి కొత్తపెళ్లి సహస్ర అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన విష‌యం తెలిసిందే. లక్షేట్టిపేట్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కొత్తపెల్లి సహస్ర జిల్లా కేంద్రంలోని మిమ్స్ జూనియర్ కళాశాలలో బైపిసి రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. కళాశాల మూడవ అంతస్తూ నుండి కంపొండ్ గోడపై పడి తీవ్ర గాయాల‌పాలు కాగా, హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like