గని ప్రమాదంలో కార్మికుడి మృతి
Singareni Mine accident:మందమర్రి ఏరియా KK5 గనిలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో యాక్టింగ్ SDL ఆపరేటర్ కార్మికుడు మృత్యువాత పడ్డాడు. కేకే5 గనిలో శుక్రవారం రెండో షిఫ్ట్లో ఈ ప్రమాదం జరగ్గా రాసపల్లి శ్రావణ్ కుమార్ (32) అనే కార్మికుడు మృతి చెందడం విషాదం నింపింది. రామకృష్ణాపూర్ కి చెందిన శ్రావణ్ జనరల్ అసి స్టెంట్, యాక్టింగ్ ఎన్డీఎల్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఎస్డీఎల్ యంత్రం మొరాయించడంతో కిందకు దిగి దాన్ని పరిశీలిస్తుండగా, 20 డిప్ 32 అప్ లెవల్ వద్ద ఆకస్మికంగా సైడ్ వాల్ కూలింది.
దీంతో ఎస్డీఎల్ యంత్రం, కూలిన సైడ్ వాల్ మధ్య ఇరుక్కుపోయిన శ్రావణ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే స్థానిక కేకే1 డిస్పెన్సరీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందారు.