ఆదివారం కూడా బ్యాంకులు పని చేస్తాయి
Sunday No Holiday:ఆదివారం కూడా బ్యాంకులు పని చేయనున్నాయి. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు శనివారం పీఎం కిసాన్ స్కీమ్ కింద 20వ విడత నిధుల్ని విడుదల చేసింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 20వ విడత కింద మొత్తం రూ.20,500 కోట్ల విలువైన నిధులను నేరుగా రైతుల అకౌంట్లలో ప్రధాని మోదీ విడుదల చేశారు. దాదాపు పది కోట్ల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతోంది. ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి.
రైతులకు ఇబ్బంది లేకుండా డబ్బులు తీసుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు అందాయి. రైతులకు అందుబాటులో ఉండేలా ఆదివారం కూడా బ్యాంకులు తెరిచి ఉంచాలని కేంద్రం స్పష్టం చేసింది.