అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌నాలు

Mahavatar Narsimha: ఆ సినిమా ప‌ట్ల ఎవ‌రికి ఎలాంటి అంచ‌నాలు లేవు.. కానీ సంచ‌నాలు సృష్టిస్తోంది.. క‌లెక్ష‌న్ల రికార్డులు సాధిస్తోంది. యానిమేటెడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. కేవలం 8 రోజుల్లో 60.5 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నార్త్ అమెరికాలో కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? ఈ సినిమాలో ఏముంది..? దీనికి ఇంత ఆదరణ ఎందుకు…?

క‌న్నడ టాప్ బ్యాన‌ర్ హోంబలే ఫిల్మ్స్ నుంచి వ‌చ్చిన యానిమేటెడ్‌ సినిమా ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’.. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొద‌టి రెండు రోజులు అస‌లు బ‌జ్ లేకుండా న‌డిచింది. అయితే ఆ త‌ర్వాత ఈ చిత్రం విప‌రీతంగా పుంజుకుంది. ముఖ్యంగా క‌న్న‌డ‌తో పాటు తెలుగులో ఈ సినిమాకి మంచి క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ.60 కోట్లు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా బరిలో ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా ఆధిక్య‌త చూపించింది. రెండో వారంలోనూ బ‌లంగా నిలబడిన ఈ సినిమా.. తాజాగా ఓ అద్భుత‌మైన‌ రికార్డ్ క్రియేట్ చేసింది.

‘మహావతార్‌ నరసింహ’ సినిమా జులై 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగుతో పాటుగా పలు ప్రధాన భాషల్లో 3డీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం రోజు రోజుకీ స్క్రీన్స్ సంఖ్య పెంచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా మరో మైలురాయి అధిగ‌మించింది. అన్ని రికార్డులను అధిగమించి, యానిమేటెడ్‌ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కేవలం 8 రోజుల్లో ₹ 60.5 కోట్లు వసూలు చేసినట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింన‌ట్లు తెలిపారు.

భార‌త‌దేశంలోనే కాదు నార్త్ అమెరికాలోనూ ఈ సినిమాకి విశేష ఆదరణ లభిస్తోంది. లిమిటెడ్ లొకేషన్స్ లో రిలీజై 8 రోజుల్లోనే $100K మార్కును క్రాస్ చేసి రోరింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని పేర్కొంది. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్, భారీ సెట్లు ఎలాంటివి లేకుండా వచ్చిన ఆ సినిమా కలెక్షన్ల‌ వర్షం కురిపిస్తోంది. మ‌హా విష్ణువు ద‌శావ‌తారాల ఆధారంగా ప‌దేళ్ల‌పాటు వ‌రుస‌గా సినిమాలు రూపొంద‌నున్నాయి. ‘మ‌హావ‌తార్’ సినిమాటిక్ యూనివ‌ర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికి ఓ సినిమా విడుదల చేయనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like