అవి రాజ‌కీయ క‌క్ష‌పూరిత బ‌దిలీలు..

-సింగరేణిలో ఆ బదిలీలను వెంటనే రద్దు చేయాలి
-రాచపల్లి శ్రావణ్ కుమార్ మరణించడం దురదృష్టకరం
-యాజమాన్యం కార్మికుల రక్షణ పట్ల అశ్రద్ధ వల్లే ప్రమాదాలు
-రాజకీయ జోక్యం పెరిగిపోయింది
-మంత్రులు ఎమ్మెల్యేల ఆధిపత్యమే నడుస్తోంది
-మాజీ మంత్రి, టీబీజీకెస్ ఇన్‌చార్జీ కొప్పుల ఈశ్వ‌ర్

Koppula Ishwar:సింగరేణిలో రాజ‌కీయ‌, క‌క్ష‌పూరిత బ‌దిలీలు జ‌రుగుతున్నాయని వాటిని వెంట‌నే నిలిపివేయాలని మాజీ మంత్రి, టీబీజీకెస్ ఇన్‌చార్జీ కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావరిఖని టీబీజీకేఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేక‌రుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. సింగరేణిలో తొమ్మిది నెలల తర్వాత జరిగిన మెడికల్ బోర్డుకి యాబై ఐదు మందిని పిలిచి కేవలం ఐదుగురిని మాత్రమే అన్‌ఫిట్‌ చేయడం దారుణమన్నారు. మైనింగ్ స్టాఫ్‌ సోదరులకు సూటబుల్ జాబ్ అని చెప్పి జనరల్ అసిస్టెంట్ గా మార్చడం గుర్తింపు, ప్రాతినిథ్య‌ సంఘాల వైఫల్యం అని దుయ్య‌బ‌ట్టారు.

గతంలో కేసీఆర్ వందకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కోరారని, మెడికల్ బోర్డుకి ఇబ్బంది జరుగుతుందని 80 నుండి 90 శాతం ఇన్‌వాలిడిటేష‌న్ చేసిన విష‌యాన్ని కొప్పుల ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ సింగరేణిలో 19 వేల మందికి ఉద్యోగాలు కల్పించారని, కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో కారుణ్య నియామకాలను కనుమరుగు చేసే పరిస్థితి కనబడుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగరేణిలో రాజకీయజోక్యం పెరిగిపోయి మంత్రులు ఎమ్మెల్యేలు ఆధిపత్యం నడుస్తోంద‌న్నారు.

తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘంలో పనిచేసే నాయకులను ఇబ్బంది పెట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యంతో బదిలీ అయిన టీబీజీకేస్ నాయకులు మాదాసు రామ్మూర్తి, జావిద్ పాషా, కొమురయ్యల కక్ష పూరితమైన బదిలీలను వెంటనే రద్దు చేయాలని యాజమాన్యాన్ని కోరామన్నారు. సింగరేణిలో రక్షణ వైఫల్యాలు జరుగుతున్నాయని మందమర్రి లో జరిగిన ప్రమాదంలో ఎస్డిల్ యాక్టింగ్ ఆపరేటర్ రాచపల్లి శ్రావణ్ కుమార్ మరణించడం దురదృష్టకరమని అన్నారు, రక్షణ కమిటీ సమావేశాలు జరగడం లేదని, యాజమాన్యం సింగరేణి కార్మికుల రక్షణపై ఎలాంటి శ్రద్ధ లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కొప్పుల ఈశ్వ‌ర్ స్ప‌ష్టం చేశారు.

మెడికల్ బోర్డులో ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారందరిని వందశాతం అన్పిట్ చేస్తామని ఎన్నిక‌ల‌ ముందు వాగ్దానాలు చేసి AITUC, INTUC నాయకులు కార్మికుల నోట్లో మట్టి కొట్టారని దుయ్య‌బ‌ట్టారు. మెడికల్ బోర్డును పునః సమీక్షించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్టమధు, టీబీజీకేఎస్ అధ్య‌క్షుడు మిర్యాల రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, వడ్డేపల్లి శంకర్, నాగెల్లి సాంబయ్య, మేడిపల్లి సంపత్, చెల్పూరి సతీష్, మాకు రమేష్, అన్వేష్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, ముదంనపల్లి రాజేశం, చిలకలపల్లి శ్రీనివాస్, చల్లా రవీందర్ రెడ్డి, దూట శేషగిరి, కొండ్ర అంజయ్య, వాసార్ల జోసెఫ్, బొడ్డు రమేష్, రొడ్డ సంపత్, పులిపాక శంకర్, మీసరాజు, మురళి పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like