భారత్‌తో పెట్టుకోవద్దు
Nikki Haley Fires on Trump :”చైనా లాంటి శత్రు దేశానికి సుంకాల విషయంలో 90 రోజుల మినహాయింపు ఇచ్చి, బలమైన మిత్రదేశమైన భారత్‌తో సంబంధాలను చెడగొట్టుకోవడం సరికాదు.. అమెరికా విదేశాంగ విధానానికి ఏమాత్రం మంచిది కాదు. భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి.. సంబంధాలు కాపాడుకోవడం చాలా ముఖ్యం”ఇదేదో భారతదేశానికి చెందిన నేతలో మరెవరో చేసిన వ్యాఖ్యలు కాదు… అమెరికాకే చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ట్రంప్ నిర్ణయాలపై తీవ్రంగా విమర్శించారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌ను విమర్శించడం సరికాదన్నారామే.. ఇది అమెరికా-భారత్ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆమె హెచ్చరించారు. చైనాకు మినహాయింపులు ఇస్తూ భారత్‌పై కఠినంగా వ్యవహరించడం సరైన నిర్ణయం కాదని ట్రంప్‌నకు సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌ను విమర్శించడం సరికాదని.. అలా చేస్తే భారతదేశం లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. చైనాకు మినహాయింపులు ఇస్తూ.. భారత్‌పై కఠినంగా వ్యవహరించడం అమెరికా విదేశాంగ విధానానికి మంచిది కాదని నిక్కిహేలీ అభిప్రాయ పడ్డారు.
భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ట్రంప్ ప్రభుత్వంలో ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారిగా పని చేశారు. ఆమె ట్రంప్ పాలనలో కేబినెట్ స్థాయి పదవిని చేపట్టిన మొదటి భారతీయ సంతతి వ్యక్తిగా చరిత్రకెక్కారు. అలాంటి వ్యక్తి ట్రంప్‌పై బహిరంగంగా విమర్శలు చేయడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది రిపబ్లికన్ పార్టీలో విదేశాంగ విధానం విషయంలో ఉన్న విభేదాలను కూడా సూచిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.