కాంగ్రెస్ నేతపై బాటిళ్లతో దాడి చేసిన ఎమ్మెల్యే
MLA Kova Lakshmi is serious:రేషన్‌కార్డుల పంపిణీలో జరిగిన గందరగోళం కాస్తా ఘర్షణకు దారి తీసింది. తన పార్టీని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ నేతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏకంగా బాటిల్‌తో పాటు చేతికి ఏ వస్తువు అందితే అది విసిరేశారు. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం.జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ లో గురువారం రేషన్ కార్డుల పత్రాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ శ్యాంనాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ శ్యాం నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, సన్నబియ్యం పంపిణీ చేయలేదంటూ విమర్శించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోవలక్ష్మి అక్కడే ఉన్న ఖాళీ బాటిళ్లను శ్యాంనాయక్‌పై విసిరేశారు.
దీంతో ఖంగుతున్న శ్యాంనాయక్, ఆయన అనుచరులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేకు వ్యతిరేఖంగా శ్యాం నాయక్ అనుచరులు నినాదాలు చేశారు. అనంతరం శ్యాంనాయక్ మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ఆమె మీద చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆమె చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.