టెన్నిస్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తా

-ఉమ్మడి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్ ఖాన్
-ఘనంగా పంద్రాగస్టు టెన్నిస్ పోటీలు
-విజేతలు నాగయ్య, శ్రీధర్

Tennis:హనుమకొండలో టెన్నిస్ క్రీడ అభివృద్ధికి కృషి చేస్తానని ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి. అజీజ్ ఖాన్ స్పష్టం చేశారు. సోమవారం హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్ఎస్ స్టేడియంలోని టెన్నిస్ గ్రౌండ్లో పంద్రాగస్టు టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అజీజ్ ఖాన్ మాట్లాడుతూ జేఎన్ఎస్ స్టేడియంలోని టెన్నిస్ కోర్టులో ఫ్లడ్ లైట్లు, క్లే కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ జిల్లాను క్రీడా హబ్ గా ఏర్పాటు చేయాలని సంకల్పించిందని తెలిపారు. త్వరలోనే హనుమకొండలో స్పోర్ట్స్ స్కూల్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ప్యాట్రాన్ ఇవి శ్రీనివాస్ మాట్లాడుతూ హనుమకొండలో విస్తరిస్తున్న టెన్నిస్ క్రీడకు కావలసిన మౌలిక వసతుల ఏర్పాటుకు అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబు రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఘనంగా టెన్నిస్ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నల్ల సురేందర్ రెడ్డి, ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి మాట్లాడుతూ జిల్లాలోని ఔత్సాహిక క్రీడాకారులను వెలుగులో తీసుకొచ్చేందుకు హనుమకొండలో ప్రతి నెల ఒక టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు.

అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలో ప్రథమ బహుమతి నాగయ్య(ఏసీపీ), శ్రీధర్ (ఆర్ఐ) జోడి ప్రథమ స్థానంలో నిలవగా, శివరాజ్, రోహిత్ జంట ద్వితీయస్థానంలో నిలిచారు. కార్యక్రమంలో హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, ఏసిపి అంబటి నర్సయ్య, పాటర్న్ కె.రవిచంద్ర, కోశాధికారి సిరికొండ సుదర్శన్, ఉపాధ్యక్షులు కుంజుబిహారి, వెంకట్ నారాయణ, మల్లారెడ్డి, పెరుమాండ్ల వెంకట్, వినీల్, సాత్విక్, శివరాజ్, వినయ్ వర్ధన్ రెడ్డి, కార్తీకుమారి, రడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like