ఏసీబీ వ‌ల‌లో ఇద్ద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగులు

ACB:తెలంగాణ‌లో ప్ర‌తి రోజూ ఏదో ఓ చోట లంచం తీసుకుంటూ దొరికిపోతున్నారు. తాజాగా మంగ‌ళ‌వారం ఇద్ద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌ట్టారు. ఒక‌రు డీఎంఅండ్‌హెచ్ఓ కార్యాల‌య ఉద్యోగి కాగా, మరొక‌రు మండ‌ల స‌ర్వేయ‌ర్‌. వీరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచార‌ణ చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా డీఎంఅండ్‌హెచ్ వో కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న ఉద్యోగి లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. ఆ కార్యాల‌యంలో జూనియర్ అసిస్టెంట్ గా ప‌నిచేస్తున్న శ్రీ‌నివాస్ ఆరు వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఉద్యోగ విరమణ పొందిన CHO తోట వెంకటేశ్వర్లు త‌న‌కు రావాల్సిన డ‌బ్బుల కోసం వస్తే శ్రీ‌నివాస్ తాను ప‌నిచేయాలంటే డ‌బ్బులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు వెంక‌టేశ్వ‌ర్లు ఏసీబీని ఆశ్రయించారు. మంచిర్యాల పట్టణంలో ఓ హోట‌ల్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. నిందితుడు శ్రీ‌నిఆవ‌స్‌ను డీఎంహెచ్ఓ కార్యాలయం తీసుకువెళ్లి విచార‌ణ చేస్తున్నారు.

పెద్ద‌ప‌ల్లిలో స‌ర్వేయ‌ర్ ప‌ట్టివేత..
ఇక‌, పెద్ద‌ప‌ల్లి జిల్లాలో ఓ స‌ర్వేయ‌ర్ లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డాడు. అవినీతి రెవెన్యూ అధికారులను వల పన్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు…. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ సునీల్ నాగార్జున రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుండి 10000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. సర్వేయర్ సునీల్ ను ఏసీబీఅధికారులు విచారిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని డిఎస్పీ విజయ్ కుమార్ కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like