ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి
Baby died in government hospital:ప్రసవసం కోసం వచ్చిన ఓ గర్భిణికి పుత్ర శోకం వెంటాడింది. పుట్టిన శిశువు చనిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్యం వల్లనే చనిపోయాడని బందువులు ఆరోపిస్తుండగా, శిశువు కడుపులోనే చనిపోయిందని ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటికి చెందిన సువర్ణ, కరణ్ దంపతులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. సువర్ణ గర్భిణి కావడంతో ప్రసవం కోసం తీసుకువచ్చారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు రాగా రాత్రి 11 గంటల సమయంలో నొప్పులు ప్రారంభం అయ్యాయి. దీంతో డ్యూటీ డాక్టరు ఆపరేషన్ చేసి బాబును బయటికి తీసారు. అయితే, బాబు చనిపోయినట్లు చెప్పడంతో డాక్టరు నిర్లక్ష్యం వల్లనే బిడ్డ చనిపోయాడని బందువులు ఆరోపిస్తుండగా, మృత శిశువు జన్మనించిదని డాక్టర్లు చెప్తున్నారు.
నిన్న మధ్యాహ్నం తమను మంచిర్యాల ఆసుపత్రికి పంపమని ఎన్నిసార్లు అడిగినా పంపించలేదని సువర్ణ భర్త కరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సహజ కాన్పు అవుతుందని ఆలస్యం చేశారని, డాక్టర్ల నిర్లక్యం వల్లనే బాబు చనిపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు బెల్లంపల్లి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.