ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణ

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణ ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ అక్టోబర్ 20,1957న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. రాధాకృష్ణన్ తన రాజకీయ ప్రయాణంలో అనేక కీలక పదవులను నిర్వహించారు. జూలై 31, 2024న మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు, ఆయన ఫిబ్రవరి 18, 2023 నుండి జూలై 30, 2024 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన మార్చి నుండి జూలై 2024 వరకు తెలంగాణ గవర్నర్‌గా మార్చి నుండి ఆగస్టు 2024 వరకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like