వర్షంలోనూ యూరియా కోసం..
Urea:యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క బస్తా యూరియా దొరికినా చాలంటూ ఎదురుచూస్తున్నారు. భారీగా వర్షం పడుతున్నా.. యూరియా బస్తాల కోసం పడిగాపులు పడుతున్నారు. సోమవారం తాండూరు మండలం వ్యవసాయ పరపతి సహకార సంఘం ముందు వర్షంలో సైతం రైతులు తడుస్తూ నిలబడ్డారు. ఉదయం 7 గంటలకే రైతులు అక్కడికి చేరుకొని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. తమకు సరిపడా యూరియా ఇవ్వాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.