తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తాటిచెట్టుపై నుండి పడి ఓ గీత కార్మికుడికి (Toddy worker injured) గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలం మాదారం 3 ఇంక్లైన్ లో చోటు చేసుకుంది.

తాండూరు మండలం మాదారం గ్రామానికి చెందిన రంగు లక్ష్మీనారాయణ గౌడ్ అనే గీత కార్మికుడు వృత్తినిర్వహణలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతనిని మంచిర్యాల లోని ఓ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీనారాయణను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, గౌడ కులస్థులు కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like