అవ‌స‌రం లేకున్నా మందులు… అధిక ధరలకు విక్రయాలు..

కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రజల వైద్యం పేరుతో వంచిస్తున్నాయని దుయ్యబడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇలాంటి ఘటనే జరిగింది..

బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లికి చెందిన సోము అనే వ్యక్తి తన కూతురికి జ్వరం రావడంతో పట్టణంలోని లిటిల్ స్టార్ పిల్లల హాస్పిటల్ కు తీసుకువచ్చాడు. అయితే, ఆ వైద్యుడు ఇవ్వమన్న మందులు కాకుండా సిబ్బంది వేరే మందులు ఇచ్చారని బాధితుడు ఆరోపించాడు. అవసరం లేకున్నా మందులు, ఇంజక్షన్లు ఇచ్చారంటూ బాధితుడు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశాడు. ఒక్కో ఇంజక్షన్ ఉన్న ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తాము ఇదే విషయాన్ని సిబ్బందిని నిలదీస్తే.. నీ దిక్కున చోట చెప్పుకోమంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని స్పష్టం చేశాడు. డాక్టర్ తప్పయ్యిందని ఒప్పుకున్నాడని వారు వెల్లడించారు. బాధితులు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా పేద ప్రజలను ఇష్టారీతిన దోచుకుంటున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like