బాణం ఇక యుద్ధం…

TBGKS:సింగ‌రేణి వ్యాప్తంగా పోరాటాలు చేయాల‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆ సంఘం ఆందోళ‌న బాట ప‌ట్ట‌నుంది. నిన్నా, మొన్న‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న TBGKSకు కొత్త గౌర‌వ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌ను నియ‌మిస్తూ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో పోరాటాల ద్వారా కార్మికుల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు యూనియ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. సింగ‌రేణి వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించి కార్మికుల హ‌క్కులు సాధిస్తామ‌ని ఆ యూనియ‌న్ అధ్య‌క్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్ర‌క‌టించారు. ఈ నెల 2 న బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి HOD లకు వినతి పత్రాలు సమర్పిస్తారు. 29న అన్ని ఏరియాల GM లకు వినతి పత్రాలు ఇస్తారు. ఇక కొత్తగూడెం ప్ర‌ధాన కార్యాల‌యం ఎదుట సెప్టెంబ‌ర్ 2న ఆందోళ‌న నిర్వ‌హించ‌నున్నారు.

తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ప్ర‌ధాన డిమాండ్లు..
1. సింగ‌రేణిలో వాస్తవ లాభాలపై 35% వాటా ప్రకటించాలి.
2. కార్మికులకు ఆదాయపుపన్ను రద్దు చేయాలి. అలవెన్స్ లపై ఆదాయపన్ను యాజమాన్యమే చెల్లించాలి
3. అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డ్ వెళ్లే కార్మికులందరిని అన్ ఫిట్ చేయాలి. 24 నెలల సర్వీస్ కాల పరిమితి 36 నెలలకు పెంచాలి
4. జూలై లో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ పంపిన 50 మంది ఉద్యోగులను తిరిగి మెడికల్ బోర్డు కు పిలిచి వారందరిని అన్ ఫిట్ (ఇన్వాలిడేషన్) చేయాలి
5. వేలం పాటతో సంబంధం లేకుండా సింగరేణికి నూతన బొగ్గుగనులు కేటాయించాలి
6. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 43 వేల కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలి
7. కొత్త ట్రాన్స్ఫర్ పాలసీ ని రద్దు చేయాలి ట్రాన్స్ఫర్ పాలసీ పారదర్శకంగా ఉండేలా చూడాలి
8. మెడికల్,ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డిపెండెంట్ లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి
9. 35 సంవత్సరాల నుండి 40 ఏళ్లకు వయసు పరిమితిని పెంచిన యాజమాన్యం వారిలో 10th క్లాస్ సర్టిఫికేట్ లేని వారిని విజిలెన్స్ కు పంపడాన్ని నిలిపివేసి వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి

ఇలా ప్ర‌ధాన డిమాండ్ల‌తో సింగ‌రేణివ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించి కార్మికుల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొనాల‌ని క్యాడ‌ర్‌కు సూచిస్తున్నారు. ఇవే పోరాటాల ద్వారా TBGKSకు నూత‌న జ‌వ‌స‌త్వాలు క‌ల్పించాల‌ని యూనియ‌న్ నాయ‌క‌త్వం భావిస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like