ఖైరతాబాద్ గణేశుడి క్యూ లైన్లో గర్భిణీ ప్రసవం..
Ganesh Chaturthi 2025:ఖైరతాబాద్ మహా గణనాయకుడి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో ఖైరాతాబాద్ గణపతి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్న ఓ గర్భిణికి ఉన్నట్టుండి పురిటి నొప్పులు వచ్చాయి. నొప్పులతో.. క్యూ లైన్లోనే పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెకు ప్రసవం చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు గర్భిణిని పక్కనే ఉన్న హెల్త్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు తల్లి, బిడ్డను పరీక్షించి ఇద్దరూ క్షేమమని ప్రకటించారు. ఆ మహిళను రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు.