వెన‌క కాదు.. ముందే ఉంటా…

క‌విత వ్యాఖ్య‌ల‌కు ముఖ్య‌మంత్రి కౌంట‌ర్‌

Revanth Reddy:ఎవరి వెనకో నేనెందుకు ఉంటా.. నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటా.. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకు ఉంటానని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారన్న కవిత వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వేరేవాళ్లను ఎదగనీయనివాళ్లు.. ఇప్పుడు పంచాయితీలు పెట్టుకుంటున్నారు.. అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ.. అంటూ రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. గొప్ప పేరు ఉన్న జనతా పార్టీ కనుమరుగు అయ్యింది.. ఎంతోమందికి అవకాశాలు ఇచ్చిన అద్భుతమైన పార్టీ టీడీపీ.. కొందరి కుట్రల వల్ల తెలంగాణలో సమస్యను ఎదుర్కొంటోంది.. దుర్మార్గాలు చేసిన BRS ఎలామనుగడ సాధిస్తుంది.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

గతంలో ఎవరినీ రాజకీయంగా బతకనివ్వమని… ఎందరినో అక్రమంగా జైళ్లకు పంపినవారు ఇప్పుడు వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకుని తన్నుకు చస్తున్నారు….యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవరో చెత్తగాళ్ల వెనుక తానేందుకు ఉంటానని ప్రశ్నించారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే… మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. నాకు అంత సమయం లేదంటూ స్ప‌ష్టం చేశారాయ‌న‌.. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అంటూ స్పందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like