సీపీ, క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు..

గ‌ణేష్ నిమ‌జ్జ‌న ఏర్పాట్ల ప‌రిశీల‌న‌లో భాగంగా వ‌చ్చిన పోలీస్ క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిషోర్ ఝా, క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్ తాండూర్ ఐ.బి.లో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ మండలిని సందర్శించారు. ఈ సంద‌ర్భంగా వారిరువురూ ప్రత్యేక పూజలు చేశారు. క‌లెక్ట‌ర్‌, సీపీ ఇద్ద‌రిని క‌మిటీ స‌భ్యులు స‌న్మానించారు. కార్య‌క్ర‌మంలో క‌మిటీ అధ్యక్షుడు మ‌ద్దికుంట రాంచంద‌ర్‌, క‌న్వీన‌ర్ త‌న్నీరు బుచ్చ‌య్య‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క‌స్తూరి శ్రీ‌హ‌రి, కోశాధికారి వెన్న‌ముద్ద‌ల స‌తీష్‌, ముఖ్య స‌ల‌హాదారు వీవీఆర్‌కే ప్ర‌సాద్‌, గౌర‌వ అధ్య‌క్షులు తాళ్ల‌ప‌ల్లి దిలీప్ గౌడ్‌, ఎలిశెట్టి శ్రీ‌నివాస్‌, చిలువేరు శేష‌గిరి, ఉపాధ్యక్షులు స‌బ్బ‌ని శ్రీ‌నివాస్‌, త‌న్నీరు మ‌ధుక‌ర్‌, ఠాకూర్ ఉమ్రావ్ సింగ్‌, సంయుక్త కార్య‌ద‌ర్శులు దుగ్గిరాల హ‌న్మంత‌రావు, ఎర్రంశెట్టి స‌త్య‌నారాయ‌ణ‌, యూత్ క‌మిటీ స‌భ్యులున్నారు. కార్య‌క్ర‌మంలో జిల్లా కాంగ్రెస్ క‌మిటీ ఉపాధ్య‌క్షుడు సూరం రవీంద‌ర్‌, కాంగ్రెస్ నాయ‌కుడు సిరంగి శంక‌ర్, విద్యాభార‌తి విద్యాసంస్థ‌ల అధినేత శ‌ర‌త్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like