వినాయ‌క మంట‌పం వ‌ద్ద పోలీసుల మాస్ డ్యాన్స్‌

Police dance at Vinayaka Mandapam:మ‌నం పండుగ‌లు చేసుకుంటూ ఉంటే వారు బందోబ‌స్తు విధుల్లో అప్ర‌మ‌త్తంగా ఉంటారు. మ‌నం ఆట‌పాట‌ల్లో మునిగి తేలుతుంటూ వారు కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వ‌హిస్తుంటారు.. పండ‌గైనా, పబ్బ‌మైనా వారు డ్యూటీలో ఉండాల్సిందే.. ఎప్పుడూ కంటి మీద కునుకు లేకుండా బిజీగా గడిపే పోలీసులు డ్యాన్స్ స్టెప్పుల‌తో అదరగొట్టారు..

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీసులు వినాయక మండపం వద్ద యువ‌త‌తో క‌లిసి డ్యాన్స్‌లు వేశారు. సీఐ, ఎస్ఐలు మాస్ డ్యాన్స్‌ల‌తో ఇర‌గ‌దీశారు. ఎప్పుడు విధుల్లో ఉండే పోలీసులు అదిరిపోయే స్టెప్పులతో హుషారెత్తించారు.. డీజే పాటలకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ.. తనలోని డ్యాన్స్ టాలెంటు బయటపెట్టారు. పోలీసులు ఆనందంతో డ్యాన్సులు చేయటం చూసి.. అక్క‌డి యువ‌త‌ కూడా వాళ్లతో కలిసి కాలు కదిపారు. రోజూ.. భద్రతా చర్యల్లో పాల్గొంటూ సీరియస్‌గా ఉన్న పోలీసులు.. ఇలా ఆనందంగా వాళ్లతో కలిసి స్టెప్పులు వేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like