వినాయక నిమజ్జనంలో డీసీపీ
బెల్లంపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన వినాయక నిమజ్జనం ఎంతో వైభవంగా నిర్వహించారు. అంతకుముందు వినాయక విగ్రహానికి మంచిర్యాల డీసీపీ ఎగ్గిడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, హెడ్ క్వార్టర్స్ అడ్మిన్ సంపత్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీసులు అంటే నిత్యం పని ఒత్తిడి ఉంటుందని, పండగలు, ఉత్సవాల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో దుర్గామాత ఆలయ కమిటీ అధ్యక్షుడు రాంసింగ్, సభ్యులు మల్లేష్ (ఆర్ఎస్ఐ), డీ.రాజు (ఏఆర్ఎస్ఐ), సమ్మయ్య (హెడ్ కానిస్టేబుల్) తదితరులు పాల్గొన్నారు.