భర్తను చంపిన మూడో భార్య..
The third wife who killed her husband:ప్రియుడితో కలిసి భర్తను అతని మూడో భార్య హత్య చేసింది. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఓ వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. శవాన్ని మూటగట్టి బావిలో పడేయగా, మరుసటి రోజు అది రెండో భార్య గుర్తించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
సంతానం కోసం మూడో వివాహం చేసుకున్నాడు. అనుకున్న విధంగా పిల్లలు పుట్టారు. కానీ.. పిల్లల బాగోగులు చూసుకోకుండానే ప్రాణాలు వదిలాడు. వస్తుందని ఊహించలేకపోయాడు. మూడో భార్య చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. అతడికి పెండ్లైంది.. భార్య వదిలేయడంతో రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు పిల్లలు లేకపోవడంతో చివరకు ఆమె చెల్లెలిని మూడో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు వారికి సంతానం కలిగింది.
అనుప్పూర్ జిల్లా సకారియా గ్రామానికి చెందిన భయ్యాలాల్ రజక్ (60) మూడు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య వదిలేసి వెళ్లిపోవడంతో గుడ్డిబాయి అనే మహిళను మళ్లీ వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు సంతానం కలగలేదని ఆమె చెల్లెలు మున్ని అలియాస్ విమలను పెళ్లిచేసుకోగా ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, స్థానిక స్థిరాస్తి వ్యాపారి లల్లూ అలియాస్ నారాయణ్ దాస్ కుష్వాహాతో మున్నీకి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరువురి మధ్య సంబంధం బలపడటంతో భయ్యాలాల్ అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఇందుకోసం పథకం వేసి ధీరజ్ కోల్ (25) అనే యువకుడి సాయం తీసుకున్నారు.
ఈ ముగ్గురూ కలిసి ఆగస్టు 30న రాత్రి భయ్యాలాల్ హత్యకు ప్లాన్ చేశారు. ఆ రోజు రాత్రి నిర్మాణంలో ఉన్న ఇంట్లో భయ్యాలాల్ పడుకుని ఉండగా, వేకువఝామున 2 గంటల ప్రాంతంలో లలూ, ధీరజ్ కలిసి భయ్యాలాల్‌ను ఇనుప రాడ్డుతో తలపై కొట్టి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక సంచిలో చుట్టి, రాళ్లు కట్టి బావిలో పడేశారు. మరుసటి రోజు ఉదయం భయ్యాలాల్ రెండో భార్య గుడ్డి బాయి ఏదో పని మీద అటుగా వెళ్లి బావిలో చూడగా ఏదో తేలుతున్నట్లు కనిపించింది. భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.