బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం
Governor approves BC reservation bill:తెలంగాణలో 42శాతం BC రిజర్వేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి.. బిల్లు గవర్నర్‌కు పంపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆ బిల్లుకు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశాలని అధికారులను ఆదేశించింది. దీంతో తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైయ్యే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా ఆర్డినెన్స్‌ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు పంపింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018లోని సెక్షన్ 285Aని సవరించడానికి ఈ ముసాయిదా ఆర్డినెన్స్ ప్రయత్నించింది. ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన వర్గాలు (BC)లకు మొత్తం రిజర్వేషన్లను 50 శాతంగా పరిమితం చేస్తుంది.
గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లను ఖరారు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిర్ణయించిన గడువు సెప్టెంబర్ నెలతో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. జూలై చివరి నాటికి రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి, సెప్టెంబర్ 30 నాటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టాన్ని సవరించాలనే పంచాయతీ రాజ్ శాఖ ప్రతిపాదనను న్యాయ శాఖ ఆమోదించింది. తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో శాసనసభ ఆమోదించింది. గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపారు. దీంతో ప్రభుత్వం పంపిన బిల్లులకు సెప్టెంబర్ 9వ తేదీన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు.