యాజమాన్యం మొండివైఖరి ఎదుర్కోవాలి
INTUC:కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి ఎదుర్కోవాలని ఐఎన్టీయూసీ (INTUC) సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటిపై దృష్టి సారిస్తామన్నారు. మెడికల్ బోర్డు, మారుపేర్ల మార్పు, డిస్మిస్ కార్మికుల సమస్యలు, విజిలెన్స్ సమస్యలు, క్యాడర్ స్కీమ్ అమలు వంటి అంశాలను రాబోయే జేసీసీసీ సమావేశంలో చర్చించాల్సిన ముఖ్య అంశాలుగా గుర్తించినట్లు వెల్లడించారు.
సమావేశంలో యూనియన్ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించడంతో పాటు, కార్మికుల పట్ల యాజమాన్యం అవలంబిస్తున్న మొండి వైఖరి ఎదుర్కొనే విధానాలపై ఐఎన్టీయూసీ నాయకత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. లాభాల వాటా, కాంట్రాక్టు కార్మికుల బోనస్, పర్క్స్పై ఐటీ మాఫీ వంటి అంశాలను సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. సమావేశంలో మహిళా ఐఎన్టీయూసీ అధ్యక్షురాలు శేష రత్నం, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ఎస్. నరసింహ రెడ్డి, పి. ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, త్యాగరాజన్, జెట్టి శంకర్ రావు, వైస్ ప్రెసిడెంట్లు జోగ బుచ్చయ్య, రఘుపతి రెడ్డి, కలవేన శ్యామ్, జనరల్ సెక్రటరీలు వికాస్ కుమార్ యాదవ్, రాజేందర్, ఎం.డి. అక్రమ్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్, రీజినల్ జనరల్ సెక్రటరీలు అల్బర్ట్, గోచికొండ సత్యనారాయణ, ఆరెపల్లి శ్రీనివాస్. ఏరియా వైస్ ప్రెసిడెంట్లు కె. సదానందం, రవీందర్ రెడ్డి, మాధుకర్ రెడ్డి, దేవి భూమయ్య, పేరం శ్రీనివాస్ పీతాంబరం, వెంకటేశ్వర్లు, కృష్ణం రాజు, యువజన ఐఎన్టీయూసీ అధ్యక్షుడు రాజు, కాంట్రాక్టు కార్మికుల సంఘం నాయకులు వాడేపల్లి దాస్పా