డ‌బ్బులు అడిగితే నేరుగా ఫోన్ చేయండి

Minister Jupally Krishna RaoP:ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎవ‌రైనా డబ్బులు అడిగితే త‌న‌కు నేరుగా నాకు ఫోన్ చేయాల‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు స్ప‌ష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్దిదారులను అధికారులు కానీ ప్రజాప్రతినిధులు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. అలా ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ కానీ.. మెసేజ్ కానీ చేయాలంటూ త‌న‌ సెల్ 9848014089 నంబర్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చారు మంత్రి.

గురువారం బోథ్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేశారని, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ముందుకు వెళ్తోందని స్ప‌ష్టం చేశారు. ఆరు గ్యారంటీలకు పెద్దపీట వేసిందని వెల్ల‌డించారు.

ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాక నిర్మించుకోని వారి ఇండ్లు రద్దు చేయవద్దని మంత్రి జూప‌ల్లి అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. వారికి బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి ఇండ్లు కట్టుకునేలా చూడాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశించారు. అధికారులు ఏ ఫైల్ అయినా 5 రోజులు లేదా 15 రోజుల కంటే ఎక్కువ రోజులు తమ వద్దఉంచుకోవద్దని వెల్ల‌డించారు. ఏ అధికారికి అర్జీలు ఇచ్చినా రెండు పేపర్లు ఇచ్చి ఒక్క దానిపై సంతకం తీసుకోవాల‌ని కోరారు. ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం, మీరు రోజంతా కష్ట పడుతున్నారు. కానీ మీ మెడల్లో తులం బంగారం కనిపించడం లేదంటూ ఆవేదన వ్య‌క్తం చేశారు. మీ సంపాదన అంతా ప్రైవేట్ స్కూళ్లకు పెడుతున్నారని.. అలా కాకుండా, మంచిగా చదువు చెప్పే ప్రభుత్వ స్కూల్స్ కు పిల్లల్ని పంపకుండా అంతంత మాత్రం చెప్పే ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారని అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like