కలెక్టరేట్లో మంత్రి సమావేశం… కూలిన బాల్కనీ..
Ministerial meeting at the Collectorate… Collapsed balcony: ఓ వైపు కలెక్టరేట్ లోపల పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నడుస్తోంది. ఇంతలో భారీ శబ్దంతో వరండా కూలిపోయింది.. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బోథ్‌లో పలు అభివృద్ది పనులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతుండగానే కలెక్టర్ ఛాంబర్ పక్కనే ఉన్న మొదటి అంతస్తు భవనం వరండా కూలిపోయింది. ఏ సెక్షన్ కు చెందిన బాల్కనీ కూలిపోగా, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.