రాయితీ సిలిండర్ల పట్టివేత

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్‌లో హోట‌ల్లో వాడుతున్న రాయితీ సిలిండ‌ర్ల‌ను అధికారులు ప‌ట్టుకుని సీజ్ చేశారు. కాగ‌జ్‌న‌గ‌ర్‌, ఈజ్‌గాంలో ప‌లు హోట‌ల్లో జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్థానిక తహసిల్దార్ మధుకర్ ఆధ్వర్యంలో పలు హోటళ్ళ పై దాడులు నిర్వహించారు. ఇందులో కాకతీయ మెస్, శ్రీ అన్నపూర్ణ హోటల్ , రూమన్ కళ్యాణి బిర్యానీ, ఆదిత్య పర్మిట్ రూమ్, శ్రీ హోటల్, పంకజ్ దాభా, సంగీత హోటల్ , సలాసర్ స్వీట్ హౌస్ హోట‌ల్లో అక్రమంగా వినియోగిస్తున్న (17) డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకొని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్ కుమార్, శ్రీనివాస్, ఆర్ఐ సిద్ధార్థ పాల్గొన్నారు.

ఈ హోటళ్ళ యజమానులపై చర్యలకు పై అధికారులకు నివేదిక సమర్పించామ‌ని అధికారులు వెల్ల‌డించారు. హోటల్లు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలని ఈ సందర్భంగా తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ రాయితీ సిలిండర్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like