హైదరాబాద్లో దాండియా నైట్స్
Dandiya Nights in Hyderabad:ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ నోవాటెల్లో సెలబ్రిటీ దాండియా నైట్స్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సెప్టెంబర్22 నుండి అక్టోబర్2 వరకు ప్రతి రోజు రాత్రి7 నుంచి ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి రోజు స్పెషల్ గార్బా డ్యాన్స్, డిజె ప్లేయర్స్ తో అద్భుతమైన కార్యక్రమాల నిర్వహణ ఉంటుందన్నారు. ఫుడ్ స్టాళ్లు, సెలబ్రిటీల విజిటింగ్, హై సెక్యూరిటీ మధ్య కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దీనికి సంబంధించిన టికెట్ల కోసం బుక్ మైషోలో టిక్కెట్లు తీసుకుని ఈవెంట్ కి హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9291551917, 9492371917 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.