కార్మికుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపండి

Kalvkuntla Kavitha:సింగ‌రేణిలో కార్మికుల స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించి త‌క్ష‌ణ‌మే సానుకూల ప‌రిష్కారం చూపాల‌ని HMS గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కోరారు. HMS గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికైన కవిత మొదటిసారి సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదురుకుంటున్న పలు సమస్యల పై కవిత, రియాజ్ అహ్మద్ సీఎండీతో చర్చించారు. అనంత‌రం ఆయ‌న‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

సీఎండీకి హెచ్ఎంఎస్ నేత‌లు ఇచ్చిన విన‌తిప‌త్రంలోని అంశాలు
1. తక్షణమే సింగరేణి యాజమాన్యం వచ్చిన లాభాలు ప్రకటించి 35 శాతానికి తగ్గకుండా లాభాలో వాటాను కార్మికులకు అందజేయాలి
2. మెడికల్ బోర్డు మూలంగా నష్టపోయిన 54 మంది కార్మికులకు వెంటనే రీ మెడికల్ బోర్డు నిర్వహించి వారికి న్యాయం చేయాలి. గతంలో లాగా మెడికల్ బోర్డు ప్రతి నెల రెండు సార్లు నిర్వహించాలి. మెడికల్ బోర్డు పెండింగ్ లో ఉండడం వలన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.
3.10 వ తరగతి అనే సాకుతో పెండింగులో పెట్టిన ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలి అని ఎలాంటి చదువు లేకున్నా డిపెండెంట్లకు ఉద్యోగం ఇవ్వాలి
4.పెండింగ్ లో ఉన్న క్లరికల్ పరీక్ష నిర్వహించాలి. పరీక్షకు సిద్ధం అయిన అభ్యర్థులకు న్యాయం చేయాలి
5. నిమ్స్ టారిఫ్ పేరిట నాణ్యమైన వైద్యం అందలేకపోతుంది. దీని స్థానంలో CGHS పాలసీ అమలు చేసి కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాలి.
6. భూనిర్వాసితులకు కంపెనీలో ఉద్యోగం ఇచ్చే విధంగా పాలసీ అమ‌లు చేయాలి. గతంలో 600 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశం కల్పించిన విధంగా ఇతరులకు కూడా ఉద్యోగం ఇవ్వాలి.
7.190/240 నిండిన బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ గా రెగ్యులరైజ్ చేయాలి.
8.మారు పేర్లు సమస్యను వెంటనే పరిష్కరించి పెండింగులో ఉన్న వారికి ఉద్యోగం ఇవ్వాలి
9. ఇటీవలే మారుపేర్ల విషయం లో డిస్మిస్ చేసిన కార్మికులను వెంటనే మళ్లీ వీధిలోకి తీసుకోవాలి
10.పెర్క్స్ అలవెన్సు పై టాక్స్ రద్దు చేయాలి
11.ప్రతి ఏరియాలో CBSE స్కూల్స్ ఏర్పాటు చేయాలి

ఇంకా అనేకమైన సమస్యలపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన సీఎండీ త్వరలోనే ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని HMS గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like