హోదా ప‌క్క‌న బెట్టి… బైక్‌పై క‌లియ‌దిరిగి..

Minister Seethakka inspects the work of the Medaram Jathara:మేడారం జాత‌ర ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో మంత్రి సీత‌క్క ఆదివారం జాత‌ర ప‌నులు ప‌రిశీలించారు. ఆమె అంత‌టా క‌లియ‌దిరుగుతూ ప్రత్యక్షంగా పరిశీలించారు. హోదా పక్కనపెట్టి బైక్ పై కలియ తిరిగి మేడారం జాతర రహదారులను పరిశీలించి పలు సూచనలు చేశారామె. ములుగు ఎస్పీ శ‌బ‌రీష్ బైక్ న‌డుపుతుండ‌గా, వెన‌కాల కూర్చుని ప‌నులు జాత‌ర ప‌నులు ప‌ర్య‌వేక్షించారు మంత్రి సీత‌క్క‌..

జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించేందుకు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ప్రత్యేక మార్గాలపై పోలీసు అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రముఖుల రాకపోకల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు.

జాతర ప్రాంతంలో వాహనాల కదలిక, పార్కింగ్ సదుపాయాలు, అత్యవసర వాహనాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సమగ్ర ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అయితే హోదాను పక్కనపెట్టి మంత్రి సీతక్క ఎస్పీ బైక్ ప్రయాణించి మహాజాతర ఏర్పాట్లను పరిశీలించడంతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like