వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలి

-మెడికల్ బోర్డు వెంట‌నే నిర్వహించాలి
-టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాసరావు డిమాండ్

TBGKS:సింగ‌రేణి ఆర్థిక లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలని, మెడిక‌ల్ బోర్డు వెంట‌నే నిర్వ‌హించాల‌ని టీబిజీకేఎస్ బెల్లంప‌ల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు మల్రాజ్ శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి ఏరియా ఖైరగూడ ఓపెన్ కాస్ట్ సందర్శించారు. కార్మికులను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలలో 35% సింగరేణి ఉద్యోగులకు చెల్లించాలన్నారు. దసరాకు కేవలం 15 రోజుల సమయం ఉన్నదని ఇప్పటి వరకు లాభాలు ఎంతో, వాటా ఎంతో ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని వెంటనే లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎంతో సాహ‌సంతో తీసుకున్న వార‌స‌త్వ ఉద్యోగం విష‌యంలో అల‌స‌త్వం ప‌నికిరాద‌న్నారు. మెడికల్ బోర్డు ఆరు నెలల నుంచి నిర్వహించడం లేదన్నారు. దానిని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేక‌పోతే టీబీజీకేఎస్ ఆధ్వ‌ర్యంలో పెద్దఎత్తున పోరాటం చేస్తామ‌న్నారు. సమావేశంలో ఫిట్ కార్యదర్శి బొంగు వెంకటేష్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేష్, సెంట్రల్ కమిటీ జాయింట్ సెక్రెటరీ ఓరం కిరణ్, నాయకులు జూనియర్ తిరుపతి, దస్తగిరి రమేష్, రాజమౌళి, రాజేశం, బిక్షపతి, అజీమ్ రవీందర్, రవి కిరణ్, కైతస్వామి, బోరిగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like