ఇబ్బంది లేదు… ఇంటికి చేరుకున్నా..
Madhu Yaskhi Goud:అస్వస్థతతో AIG ఆస్పత్రిలో చికిత్స పొందిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్ట్ అయ్యారు. కాసేపటి కిందట ఆయన హైదరాబాద్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్‌మీడియాలో అభిమానులు, నేతలు, కార్యకర్తలనుద్దేశించి పోస్టు చేశారు.
డిశ్చార్జ్ అనంతరం ఇంతకుముందే ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం కుదుటపడింది. ఎలాంటి ఆందోళన లేదు. నా ఆరోగ్యం గురించి ఆందోళన చెంది ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఫోన్ ద్వారా వాకబు చేశారు. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. యథావిధిగా రోజూ వారి కార్యక్రమాలలో మీ అందరితో కలిసి పాల్గొంటానని తెలియజేస్తున్నానంటూ మధుయాష్కి వెల్లడించారు.
పరామర్శించిన మంత్రులు వివేక్, పొన్నం
స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన యధుయాష్కిని మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ గౌడ్ బంజారా హిల్స్ లోని ఆయన నివాసానికి వచ్చి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎంపీ బలరాం నాయక్, ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ సైతం ఆయనను పరామర్శించారు.