పెద్ద‌పుల‌ల వ‌రుస దాడులు.. ముగ్గురి మృతి

Tiger Attacks:తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో పులుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో జ‌రిగిన ఈ పులుల దాడుల్లో ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు. ఒకే రోజు వేర్వేరు చోట్ల ముగ్గురిపై దాడి చేశాయి. మృతుల్లో ఓ మహిళ, ఓ పురుషుడు, ఓ బాలుడు ఉన్నాడు. ఈ మూడు ఘటనలతో చంద్రపూర్ జిల్లాలో జ‌నం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో పులి దాడిలో లాఖపూర్ గ్రామానికి చెందిన సునీల్ రౌత్ (32) అనే పశువుల కాపరి మృతి చెందాడు. గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో పశువులు మేపడానికి వెళ్లిన సునీల్పై పొదల్లో దాక్కుని ఉన్న పులి దాడి దాడి చేసి చంపేసింది. చిమూర్ తాలూకాలోని మౌజా లావరీ గ్రామానికి చెందిన మహిళ విద్యా కైలాస్ మస్రామ్ (40) తన పొలంలో పనికి వెళ్లినప్పుడు ఆమెపై దాడి చేయ‌డంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో మౌజా లావరీ గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.

సిందేవాహి తాలూకాలోని గడ్బోరి గ్రామంలో గురువారం రాత్రి ప్రశీల్ బాబన్ మంకర్ (9)అనే బాలుడిని ఇంటి ప్రాంగణం నుంచి చిరుత పులి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. అటవీ ప్రాంతంలో బాలుడి మృత దేహం గుర్తించారు. ఈ ప్రాంతంలో వన్య ప్రాణులతో ముప్పు ఉందని గ్రామస్తులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like