సింగరేణి సమస్యలు పరిష్కరించండి
AITUC:సింగరేణికి సంబంధించిన పలు సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ నేతలతో పాటు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని MLA, కూనంనేని సాంబశివ రావు, , ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందించారు. వాస్తవ లాభల్లో 35 శాతం వాటా ఇవ్వాలని, సొంత ఇంటి పథకం అమలు చేయాలని కోరారు. వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటుచేయాలనీ అందరిని ఆన్ ఫిట్ చేసి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. మారుపేర్ల సమస్య విషయంలో అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా త్వరగా ఇచ్చేట్లు ఆదేశాలి వ్వాలని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఇన్‌కంటాక్స్ విషయంలో పెర్స్క్‌పై రికవరీ చేసిన వాటిని కార్మికులకు రిఫండ్ చేయాలని కోరారు. అంతేకాకుండా, నూతన బొగ్గుగనులు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలివ్వాలన్నారు. కోయగూడెం -3,సత్తుపల్లి -3,తాడిచర్ల -2 బ్లాకులను సింగరేణికే వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు , యాజమాన్యం యూనియన్ తో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు ఏఐటీయూసీ నాయకులు వెల్లడించారు. లాభాల వాటా విషయంలో తగిన నిర్ణయం తీసుకునేలా ఆదేశాలిస్తామని సీఎం చెప్పినట్లు వారు వెల్లడించారు. స్పందించిన ముఖ్యమంత్రికి ఏఐటీయూసీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.