వీడు వీడి ఓవ‌రాక్ష‌న్..

పాకిస్తాన్ అంటేనే ఓవ‌రాక్ష‌న్‌… ఇక ఆ దేశక్రికెట‌ర్ల గురించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కొంచెం ఏదైనా జ‌రిగితే చాలు… అతి చేస్తారు.. ఆసియాకప్‌ 2025లో భారత్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనింగ్ బ్యాటర్ చేసిన‌ సెలబ్రేషన్స్ విస్మ‌యం క‌లిగించాయి. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత సాహిబ్జాదా ఫర్హాన్ విస్మయం గొలిపే రీతిలో సంబరాలు చేసుకున్నాడు. తన బ్యాట్‌ను ఏకే 47 గన్ తరహాలో పట్టుకున్నాడు. గన్‌తో గాల్లో కాల్పులు జరిపినట్లు.. మూడు సార్లు తుపాకీ పేల్చినట్లు ఫోజులు ఇచ్చాడు.

ఈ వీడియో చూసి నెటిజన్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే భారత ఫ్యాన్స్ వైపు చూస్తూ ఫర్హాన్ ఇలా చేశాడని పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం ఇది పూర్తిగా రెచ్చగొట్టే చర్య అని.. దీనిపై ఐసీసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్‌ను అందరూ ఉగ్రవాదుల ఉండే దేశం అని ఎందుకు అంటారో.. మరోసారి రుజువైందని చురకలు అంటిస్తున్నారు.

అయితే, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓట‌మి పాల‌య్యింది. ఆదివారం రాత్రి జరిగిన రెండో సూపర్-4 మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థానీలను ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించింది. 19వ ఓవర్‌లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో తిలక్ వర్మ ఒక సిక్స్, ఆపై ఒక ఫోర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. అతను 19 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్.. పాకిస్తాన్ జట్టును 5 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితం చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like